Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పుదుచ్చేరి
కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు, కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి నివేదిక ఇచ్చానని గవర్నర్ తెలిపారు. 5 లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని, ఖమ్మం సభకు లేని కరోనా రిపబ్లిక్ డేకు గుర్తు వచ్చిందా? అని పుదుచ్చేరి గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల నుంచి రాజ్‌భవనంపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. ప్రభుత్వం రాజ్యాంగ విలువలు పాటించడంలేదని తమిళిసై ఆరోపించారు.
ఫామ్‌హౌస్‌లు కట్టడం కాదని, అందరికి ఫార్మ్‌లు కావాలని, రైతులు, పేదలు అందరికీ భూములు, ఇళ్లు కావాలని గవర్నర్ తెలిపారు. మన పిల్లలు విదేశాల్లో చదవడం అభివృద్ధి కాదని, రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఉండాలని తమిళిసై స్పష్టం చేశారు. రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని గవర్నర్ అన్నారు. తెలంగాణ ప్రజలంటే తనకు ఇష్టమని తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందని గవర్నర్ అన్నారు.