Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో రైతు సంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్ల తో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మోసపూరిత ఆలోచనలతో రద్దు చేసిన 3 నల్ల చట్టాలను మరో రూపంలో అమలు చేసేందుకు సిద్ధపడుతుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రైతు విమోచన చట్టం, విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దుచేయాలని వారు డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో వ్యవసాయరంగం నిర్వీర్యమై రైతులు మరింత నష్టపోతారని తెలిపారు. పెట్టుబడిదారి, పారిశ్రామిక, కార్పొరేట్, భూస్వామివర్గాలకు లబ్ధి చేకూర్చేలా విధానాలను అనుసరిస్తూ, రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని మోడీ ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.