Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఒక భారీ కార్గొషిప్ సముద్రంలో మునిగిపోయింది. జపాన్, దక్షిణ కొరియాల మధ్య సముద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో షిప్ లో 22 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో 8 మంది మరణించారు. వీరిలో ఆరుగురు చైనా జాతీయులు. ఈ షిప్ హాంకాంగ్ కు చెందిన కంపెనీది. డిసెంబర్ 3న మలేషియాలోని పోర్ట్ క్లాంగ్ నుంచి బయల్దేరింది. కలప లోడ్ తో వెళ్తున్న ఈ షిప్ జపాన్ లోని నాగసాకికి నైరుతి దిశలో 160 కిలోమీటర్ల దూరంలో మునిగిపోయింది. షిప్ మునిగిపోయిన విషయాన్ని తెలుసుకున్న జపాన్, దక్షిణ కొరియా కోస్ట్ గార్డ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టారు. ఐదుగురు సిబ్బందిని వీరు కాపాడారు. వీరిలో నలుగురు చైనీయులు ఉన్నారు. అయితే మరో 9 మంది గల్లంతయినట్టు తెలుస్తోంది.