Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
న్యూజిలాండ్‌పై మూడు వన్డేల సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. రేపటి నుంచే (జనవరి 27) మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. వన్డే సిరీస్‌లో ఆడిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటాడు. వరుసగా సెంచరీలు బాది భీకరమైన ఫామ్‌లో ఉన్నశుభ్మన్ గిల్, రంజీల్లో ట్రిపుల్ సెంచరీ బాది జోరుమీదున్న పృథ్వీ షా ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించాడు. ఇక, కివీస్‌పై వన్డే సిరీస్‌లో నిరాశపర్చిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు పొట్టి సిరీస్‌లోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మూడో వన్డేలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్య.. టీ20ల్లో అదే ఆటతీరును కొనసాగించాల్సిన అవసరముంది. మిడిల్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ మధ్య పోటీ ఉండగా.. వీరిలో ఇద్దరికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. అర్స్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌కు తుదిజట్టులో చోటు ఖాయం. శివమ్ మావి, ముఖేశ్ కుమార్‌లలో ఒకరిని మూడో పేసర్‌గా తీసుకోవచ్చు. స్పిన్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, చాహల్ మధ్య పోటీ ఉండగా.. నిలకడగా వికెట్లు పడగొడుతున్న కుల్దీప్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపొచ్చు.