Authorization
Fri May 16, 2025 10:12:44 pm
నవతెలంగాణ - అమరావతి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో తొలి అడుగు పడనుంది. యువతను కలుస్తూ, జనం సమస్యలు తెలుసు కుంటూ 400 రోజులపాటు నాలుగువేల కిలోమీటర్ల మేర రాష్ట్రమంతా ఆయన నడవనున్నారు. కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద పూజలు ముగించుకుని ఉదయం 11.03 గంటలకు లోకేశ్ యాత్రను ఆరంభిస్తారు.