Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉక్రెయిన్
ఉక్రెయిన్ దేశంపై రష్యా తాజాగా మరోసారి క్షిపణులతో దాడి చేసింది. ఉక్రెయిన్లోని కైవ్ వెలుపల ఉన్న హ్లెవాఖా పట్టణంపై రష్యా క్షిపణులతో దాడి చేసిన ఘటనలో 11 మంది మరణించారు. ఈ దాడుల్లో మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు.ఒడెసాలోని నల్ల సముద్రం ప్రాంతంలో ఇంధన ట్యాంకులపై రష్యా దాడి చేసింది.(Missile Attack) ఉక్రెయిన్ రాజధాని కైవ్ లో రష్యా దాడిలో ఒకరు మరణించారు. రష్యా క్షిపణుల దాడితో ప్రజలు మెట్రోస్టేషన్లలో తలదాచుకున్నారు. రష్యా క్షిపణుల దాడుల్లో 11 మంది మరణించారని ఉక్రేనియన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ టెలిగ్రామ్లో తెలిపింది.రష్యా సైన్యం దేశంపై ప్రయోగించిన 55 క్షిపణుల్లో 47 క్షిపణులను ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు కూల్చివేసినట్లు ఉక్రెయిన్ టాప్ జనరల్ పేర్కొన్నారు.