Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలో గంజాయి విక్రయిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్స్ ఆటకట్టించారు హెచ్-న్యూ పోలీసులు. వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన చందన్ నవీన్ అలియాస్ నవీన్ ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన నవీన్ అడ్డదారిలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్‌లో గంజాయికి డిమాండ్ ఉందని తెలుసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన తన మిత్రుడు సుల్తాన్ మాలిక్‌ను కలిశాడు. సుల్తాన్ నాంపల్లిలో ఉంటూ.. వివాహాది శుభకార్యాలకు డెకరేషన్ పనులు చేస్తుంటాడు. నగరానికి వచ్చిన నవీన్ సుల్తాన్‌ను కలిసి తాను ఒడిషా నుంచి గంజాయి తెచ్చి ఇస్తానని నగరంలో విక్రయించాలని కోరాడు. అందుకు సుల్తాన్ అంగీకరించాడు. వీరు కొంతకాలంగా నగరంలో గంజాయి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం పాతబస్తీలో గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, ఛత్రినాక పోలీసులు కలిసి దాడిచేసి ఇద్దరినీ పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు.