Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గాజువాక
విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌ను పాలక వర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గురువారం ఉదయం విశాఖ డెయిరీలో జరిగిన పాలకవర్గం సమావేశంలో సీనియర్ బోర్డు డైరెక్టర్ రెడ్డి రామకృష్ణ డెయిరీ తదుపరి చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్ పేరును ప్రతిపాదించగా మరో సీనియర్ డైరెక్టర్ కోళ్ల కాటమయ్యతో పాటు ఇతర పాలక వర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆడారి ఆనంద్‌కుమార్ తన తండ్రి దివంగత తులసీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ తన తండ్రి తులసీరావు విశాఖ డెయిరీ చైర్మన్‌గా గత 36 సంవత్సరాలుగా చేసిన సేవలను గుర్తు చేశారు. మేలైన పశుజాతిని, పశు దాణాను, పశు వైద్యాన్ని అందించి పాడి రైతుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
పాడి రైతులకు ఆరోగ్య సంక్షేమ పథకాలు, సేవలు అందిస్తూ విశాఖ డెయిరీను మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. నూతన చైర్మన్ ఆనంద్‌కుమార్‌కు విశాఖ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వీ రమణ పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.