Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
గల్ఫ్ దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో గురువారం 74వ గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దుబాయిలో భారతీయ కాన్సులేట్ జనరల్ అమన్ పూరీ పతాకావిష్కరణ చేసి రాష్ట్రపతి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అలాగే, అబుధాబిలో రాయబారి సంజయ్ సుధీర్ పతాకావిష్కరణ చేసి రాష్ట్రపతి ప్రసంగాన్ని చదివారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులకు సేవలందిస్తున్న ఇండియన్ పీపుల్స్ ఫోరం వాలంటీర్లను రాయబారి సత్కరించారు. దుబాయిలో భారతీయ విద్యార్థులు జాతీయ స్ఫూర్తితో ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆలపించిన గేయాలు అబ్బురపర్చాయి. షార్జా, రాస్ అల్‌ఖైమా, ఇతర ఎమిరేట్లలోని భారతీయ సంఘాల్లో కూడా కాన్సులేటు అధికారులు భారత జాతీయ పతాకావిష్కరణలు చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో నూతన రాయబారి డాక్టర్ సుహేల్ అహ్మద్ ఖాన్, జెద్దాలో భారతీయ కాన్సులేటు జనరల్ షాహిద్ ఆలం పతాకావిష్కరణ చేసి ఆత్మనిర్భర్ గురించి ప్రస్తావించారు. కువైత్, ఖతర్, ఒమాన్, బహ్రెయిన్ దేశాల్లోని భారతీయ ఎంబీసీల ఆధ్వర్వంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. కొవిడ్ నిబంధనలను పూర్తిగా తొలగించిన అనంతరం అనేక దేశాల్లో గురువారం రాత్రి రాయబారులు విదేశీ అతిథులకు గణతంత్ర దినోత్సవ విందు ఏర్పాటు చేశారు.