Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సీనియర్ నటి జమున (86) నేడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1936 ఆగస్ట్ 30న హంపిలో జమున జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో జమున సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్‌కు జమున పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు. సత్యభామ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. 1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఎన్నికయ్యారు.