Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉపాధి కోసం అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళం జిల్లా యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన టి. రవికుమార్ (35) నౌకలో పనిచేసేందుకు మరో 10 మందితో కలిసి ఈ నెల 17న అమెరికా వెళ్లాడు. మూడు రోజుల క్రితం అక్కడ సీమన్‌గా ఉద్యోగంలో చేరాడు. బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు కంటెయినర్ పైనుంచి జారిపడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్నికుటుంబ సభ్యులకు తెలియజేశారు. రవికుమార్‌కు భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవికుమార్ మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.