Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుప్పం
ప్రజల గుండెచప్పుడు విని వారికి భరోసా ఇచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ తరుణంలో చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 11.03 గంటలకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కాలి నడకన తిరిగి క్షేత్ర స్థాయి పరిస్థితులను కళ్లారా చూడనున్నారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర కొనసాగనుంది. అయితే కుప్పంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణతో పాటు పలువురు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పాదయాత్రలో పాల్గొన్నారు.