Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో ఉన్న జెనిన్పై ఇజ్రాయెల్ సైనికులు దాడిచేశారు. దీంతో 10 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల్లో 61 ఏండ్ల మహిళ కూడా ఉన్నారని వెల్లడించారు. గత రెండు దశాబ్దాల్లో పాలస్తీనాలో జరిగిన అత్యంత ఘోరమైన ఘటనగా దీనిని అభివర్ణించారు. ఓ ప్రభుత్వ దవాఖానపై ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్ పేల్చాయని చెప్పారు. దీంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారని తెలిపారు.
ఈ ఘటనపై పాలస్తీనా ప్రధాని మహమ్మద్ ష్టయేహ్ స్పందించారు. తమ దేశంలోని పిల్లలు, యువత, మహిళలకు రక్షణ కల్పించాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను కోరారు. కాగా, దేశంలో భారీ దాడులకు ప్లాన్ చేస్తున్న తీవ్రవాదులను అరెస్టు చేయడానికి వెళ్లా తమ సైనికులు వెళ్లారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించారు.