Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అనుచిత వ్యాఖ్యలను చేశారు. కాలేజ్‌కు వెళ్లేది చదువుకోవడానికి కాదు అంటూ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్విటర్లో పంచుకున్నారు. ‘మీరు కొత్త విషయాలు తెలుసుకునేందుకు కాలేజ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు ప్రతిదీ ఉచితంగానే లభిస్తుంది. మీకు కావాల్సిందేదైనా ఉచితంగానే నేర్చుకోవచ్చు. కాలేజ్‌కు వెళ్లేది నేర్చుకోవడానికి కాదు. సరదా కోసం, మీ పనులు మీరు చేసుకోగలరని నిరూపించుకునేందుకని నా అభిప్రాయం’ అంటూ మస్క్ ఓ వీడియో క్లిప్‌లో మాట్లాడారు.
గోయెంకా ఈ వీడియోను షేర్ చేసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మస్క్ చెప్పింది రైట్ అని, డిగ్రీ కోసమే కాలేజ్ అంటూ వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి విజయవంతమయ్యాడని అతడు చెప్పే ప్రతిసలహా పరిగణించాల్సిన పనిలేదని మరికొందరు ఘాటుగా స్పందించారు.