Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జైపూర్
రాజస్థాన్లోని అజ్మీర్ పట్టణంలో గురువారం రాత్రి రెండు ఏటీఎం కేంద్రాల్లో ఏటీఎం మెషిన్లను ఎత్తుకెళ్లి భారీగా నగదు లూటీ చేశారు. ఆరెయిన్ ఏరియా నుంచి ఎత్తుకెళ్లిన ఏటీఎం మెషిన్లో రూ.8 లక్షలు, రూపన్గఢ్ ఏరియా నుంచి ఎత్తుకెళ్లిన ఏటీఎం మెషిన్లో రూ.30 లక్షలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు దొంగలు ఆ రెండు ఏటీఎం కేంద్రాల్లో చొరబడి ఏటీఎం మెషిన్లను పెకిలించిన తీరు వాటిలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. రెండు ఏటీఎం కేంద్రాల్లో దొంగతనాలు ఒకేలా జరగడంతో అది ఒకే దొంగల ముఠా పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.