Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎల్ఐసి తన వినూత్న సాంకేతిక పురోగతితో పాలసీదారులకు అత్యుత్తమ సేవలను అందిస్తోందని జోనల్ మేనేజర్ ముక్కవిల్లి జగన్నాథ్ తెలిపారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జగన్నాథ్ మాట్లాడుతూ ఉద్యోగులు, డెవలప్మెంట్ ఆఫీసర్లు కస్టమర్ల కనీస సహయంలో సేవలను పొందేందుకు వీలుగా అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సంస్థ ఎదుగుదలకు దోహదపడేలా వస్తున్న మార్పులకు ప్రతి ఒక్కరూ అలవాటు పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యానంద్ ఝా, వినీత్ శ్రీవాస్తవ్, సాయినాథ్, కె. మురళీదర్, రీజనల్ మేనేజర్లు, రాజీవ్ బిస్వాస్, సీనియర్ డిఎం హాజరయ్యారు.