Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తోన్న తాజా చిత్రం అమిగోస్. కన్నడ భామ ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అమిగోస్ లో బాలకృష్ణ ఆల్బమ్‌లోని సూపర్ హిట్సాంగ్ ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ పాటను రీమిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ సాంగ్ ప్రోమోను కల్యాణ్ రామ్ టీం లాంఛ్ చేసింది. ఈ మెలొడీ సాంగ్ ఒరిజినల్ వెర్షన్‌ను మించిపోయేలా ఉండబోతుందని ప్రోమోతో అర్థమవుతుంది. ఒరిజినల్ సాంగ్‌ను ఎస్పీ బాలు పాడగా.. రీమిక్స్ సాంగ్‌ను ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ పాడటం విశేషం. సమీరా భరద్వాజ్ ఎస్పీ చరణ్‌తో కలిసి ఈ పాట పాడింది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో కల్యాణ్ రామ్ టీం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన అమిగోస్ టీజర్ తోపాటు యెక యెక సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న అమిగోస్ ఫిబ్రవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.