Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కివీస్‌ను దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. ఐదో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ ఫిన్ అలెన్ (35) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన చాప్మన్ (0) సుందర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 43 పరుగలు వద్ద కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచిన ఫిన్ అలెన్ రెండో బంతికి అదే షాట్ ఆడాడు. కానీ సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో అతను ఔట్ అయ్యాడు. దాంతో, కివీస్ 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అలెన్ 23 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు ఫిన్ అలెన్ (29), డెవాన్ కాన్వే (5) ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ పవర్ ప్లేలో 37 పరుగులు జోడించారు. ఫిన్ అలెన్ పాండ్యా, అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో, మొదటి 2 ఓవర్లలోనే 23 పరుగులు వచ్చాయి. దాంతో పాండ్యా మూడో ఓవర్లో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను దించాడు.