Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మొదటి వన్డేలో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. ఓపెనర్ కాన్వే(52), మిచెల్ (59) అర్థశతకాలతో జట్టును అదుకున్నారు. చివరి ఓవర్లోమిచెల్ అర్షదీప్ సింగ్‌కు చుక్కలు చూపించాడు. వరుసగా 3 సిక్సర్లు బాదాడు. అతను 26 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. టీ20ల్లో అతనికిది నాలుగో ఫిఫ్టీ. కివీస్ బ్యాటర్లలో అలెన్ (35) ఒక్కడే రాణించాడు. ఫిలిప్స్(17), మైఖేల్ బ్రేస్‌వెల్ (1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో సుందర్ 2 వికెట్లు తీశాడు. కుల్దీప్, అర్ష్‌దీప్, శివం మావి తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆదుకున్న కాన్వే.. దంచి కొట్టిన మిచెల్
43 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కివీస్‌ను కాన్వే అదుకున్నాడు. ఫిలిప్స్(17)తో కలిసి జట్టు స్కోర్ వంద దాటించాడు. ఆ తర్వాత డారెల్ మిచెల్ రెచ్చిపోయి ఆడాడు. ఆఖరి ఓవర్లో పరుగుల వరద పారించాడు.మూడు సిక్స్‌లు ఫోర్ బాదడంతో ఆ ఓవర్లో 26 రన్స్ వచ్చాయి.