Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇలా అన్ని రకాల నేరాలను అరికట్టేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ డీ శ్రీనివాస్ తెలిపారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఎల్బీనగర్లోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మల్కాజిగిరి, ఎల్బీనగర్, భువనగిరి ట్రాఫిక్ ఏసీపీలు శ్రీనివాసరావు, అంజయ్య, సైదులు నేతృత్వంలో ఆయా ట్రాఫిక్ పీఎస్‌ల సిబ్బంది, శాంతి భద్రతల పోలీసుల సహకారంతో ఈ డ్రైవ్‌ను కొనసాగిస్తున్నట్లు వివరించారు. కమిషనరేట్ పరిధిలో 34 చోట్ల ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తుండగా 233 సిబ్బంది ఈ డ్రైవ్‌లో పాల్గొంటున్నారని చెప్పారు. నెంబర్ ప్లేట్ సరిగా లేని వారు, ట్యాంపరింగ్ చేసిన వారిపై ఇప్పటి వరకు 149 మందిపై ఎఫ్ఐఆర్లు కేసులు నమోదు చేశామని, 815 మందిపై మోటర్ వాహనాల చట్టం కింద జరిమానాలు విధించామన్నారు.