Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పూజ గదిలో మంటలు చెలరేగాయి. ప్రాణనష్టం లేకపోవడంతో అపార్ట్‌మెంట్‌వాసులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈస్ట్‌మారేడుపల్లిలోని శ్రీలా హైట్స్ అపార్ట్మెంట్ బీ బ్లాక్‌లో 16 ఫ్లాట్లు ఉన్నాయి. అందులోని ఓ ఫ్లాట్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌గౌడ్ ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన భార్య పూజ గదిలో దీపం వెలిగించి పూజ చేశారు. అనంతరం పక్కనే ఉన్న గదిలోకి వచ్చారు. పూజ గదిలో ప్రమాదవశాత్తు దుస్తులకు నిప్పంటుకున్నట్లు గుర్తించిన లక్ష్మణ్‌గౌడ్ ఫైర్ ఇంజన్ సిబ్బందికి సమాచారం ఇచ్చా రు. మూడు ఫైర్ ఇంజన్లతో వచ్చిన ఫైర్ సిబ్బంది అరగంటలోనే మంటల్ని ఆర్పేశారు. ప్రమాదంలో ఫ్లాట్‌లోని సామగ్రి దగ్ధం అయింది. మంటల కారణంగా మిగతా ఫ్లాట్‌లోని ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ సీఐ ఎల్లప్ప, గోపాలపురం సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్, చిలకలగూడ సీఐ నరేష్, సబ్ ఇన్స్పెక్టర్లు ఘటన స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్లో ఫైర్‌సేఫ్టీ లేదని, విచారణ జరుపుతున్నామని గోపాలపురం ఏసీపీ తెలిపారు.