Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై కవితతో ఆయన చర్చించినట్లు సమాచారం. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) స్థాపన ఉద్దేశం, లక్ష్యాలు, అజెండా తదితర అంశాలను శరత్‌కుమార్ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.