Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిత్తూరు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర రెండో రోజు శనివారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది. ఈ తరుణంలో నేడు కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీ నుంచి యాత్రను ప్రారంభించారు. ఇవాళ గుడుపల్లె మండలం, బెగ్గిపల్లె గ్రామస్థులతో లోకేష్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం కనుమలదొడ్డిలో భోజన విరామం తీసుకుని పార్టీ నేతలతో సమావేశం అవుతారు. పలమనేరు-కుప్పం హైవే పక్కన ఈ రాత్రి బస చేస్తారు. మొదటి రోజు 8.5 కిలోమీటర్లు నడిచారు. రెండో రోజు శనివారం శాంతిపురం మండలంలో 9.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది.