Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇజ్రాయెల్
జెరూసలెంలోని యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రవాది దాడికి చేశాడు. కన్పించిన వారిపై బుల్లెట్లు వర్షం కురిపించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. తూటాలు తగిలి మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ తరుణంలో నివె యాకోవ్ బోలెవార్డ్లో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తుపాకీతో ఉన్న ఉగ్రవాదిని కాల్చి చంపారు. అతను తీసుకొచ్చిన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఇది అత్యంత తీవ్రమైన ఉగ్రచర్య అని అధికారులు అన్నారు. నిందితుడ్ని పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.