Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల మూడు భారత యుద్ధ విమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్లు కూలిపోగా రాజస్థాన్లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది. రోజువారీ శిక్షణలో భాగంగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కాసేపటికే మొరెనా ప్రాంతంలో కూలిపోయినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. వి
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు స్వల్పగాయాలయ్యాయి. అలాగే రాజస్థాన్లోని భరత్పూర్లోని ఓ విమానం కూలిపోయింది. తొలుత ఇది ఛార్టర్డ్ విమానం అని వార్తలు రాగా తర్వాత అది వాయుసేనకు చెందిన యుద్ధ విమానంగా రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. వీటిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.