Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరబాద్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమాన ల్యాండింగ్ విషయంలో గందరగోళ పరస్థితి నెలకొంది. క్షణాల్లో దిగే సమయంలో ఒక్కసారిగా విమానం టేకాఫ్ కావడంతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. కాసేపు తరువాత మళ్లీ పైలట్ విమానం సేఫ్ గా లాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
వైజాగ్ నుండి హైదరాబాద్ కు బయలుదేరింది. అక్కడినుంచి సేఫ్ గానే బయలు దేరిన విమానానికి ఏం జరిగిందో తెలియదు కానీ పైలెట్ విమానం రన్ వే పై ల్యాండ్ అవుతూనే క్షణాల్లో మళ్ళీ టేకాఫ్ తీసుకున్నాడు. ఫ్లైట్ రన్ వైఫై దిగకుండా టేక్ ఆఫ్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పైలెట్ ఎందుకు మళ్లీఏదైనా ప్రమాదంలో ఉన్నామా? అనే ప్రశ్నలు కదులుతున్న సమయంలో మళ్లీ ఐదు నిమిషాల తర్వాత విమానం సేఫ్ గా లాండింగ్ చేశాడు పైలట్. ఫ్లైట్ సేఫ్ గా లాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విజిబిలిటీ సరిగా లేనందువల్లనే ఇలా జరిగిందని తెలిపారు.