Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తమిళనాడు
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ప్రేమలో విఫలమైన ఓ డాక్టర్ (29) డిప్రెషన్ లో తన ఖరీదైన మెర్సెడెజ్ బంజ్ కారుకు నిప్పు పెట్టాడు. సదరు డాక్టర్ కొన్నేళ్ల కిందట కాంచీపురంలోని ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడ్డాడు. కానీ కొన్నాళ్లకు ఆమెతో విడిపోయాడు. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.
డిప్రెషన్ నుంచి బయటికి వచ్చేందుకు పునరావాస కేంద్రంలో చికిత్స కూడా తీసుకుంటున్నాడు. ఈ తరుణంలోనే బెంజ్ కారుకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిప్పు పెట్టిన తర్వాత తాను కారు లోపలికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని సదరు డాక్టర్ ప్రయత్నించినట్లుగా అనుమానిస్తున్నారు. విచిత్రం ఎంటంటే గతంలో తన ప్రియురాలితో అతడు గడిపిన ప్రదేశంలోనే ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. కానీ అప్పటికే కారు మొత్తం కాలిపోయింది అని ఓ పోలీస్ ఆఫీసర్ వివరంచాడు.