Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరో రికార్డు అందుకుంది. జపాన్ దేశంలో అత్యధిక సెంటర్లలో వందరోజులు పూర్తి చేసుకుంటోన్న తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ ఘనత దక్కించుకుంది. ఈ తరుణంలో రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. జపాన్లోని 114 కేంద్రాల్లో శత దినోత్సవం చేసుకుంటోన్న తొలి భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్ అని ఉన్న ఓ పోస్టర్ని ఆయన షేర్ చేశారు.
ఈ క్రమంలో మునపటి రోజుల్లో ఒక సినిమా 100 రోజులు, 175 రోజులు లేదా అంతకు మించి ఆడితే అది చాలా పెద్ద విషయం. ఆ రోజులన్నీ మధుర జ్ఞాపకాలే. కాలక్రమేణా వ్యాపారం తీరు మారింది. కానీ, ఇప్పుడు జపాన్లోని సినీ ప్రియులు మాకు మళ్లీ ఆ రోజుల్ని గుర్తు చేశారు. మేము తిరిగి ఆ ఆనందాన్ని పొందేలా చేశారు. లవ్ యూ జపాన్, థ్యాంక్యూ అని రాజమౌళి సంతోషాన్ని వ్యక్తం చేశారు.