Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 5లో రోడ్డు కుంగిపోయింది. అదే సమయంలో ఆ రహదారిపై వెళ్తున్న టిప్పర్ రోడ్డులోకి కుంగిపోయింది. టిప్పర్ డ్రైవర్, ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు కుంగిపోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఈ తరుణంలో రోడ్డు పక్కనే నాలా ప్రవాహం ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.