Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుక కోసం స్కూల్‌కు వెళ్తున్న బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బీహర్‌లోని బక్సర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ నెల 26న రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం ఒక బాలిక స్కూలుకు బయలుదేరింది. మార్గమధ్యలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. కిడ్నాప్ చేసి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాగా, బాధిత బాలిక అతి కష్టంమీద ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా సామూహిక లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను గుర్తించి వారి ఇళ్లపై రైడ్ చేసి అరెస్ట్ చేశారు.