Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జోగుళాంబ: గద్వాల జిల్లా టీటీదొడ్డి గ్రామంలో అంతర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం పోటీలు పోటాపోటీగా జరిగాయి. స్థానిక గుండ్ల భీమరాయుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఈ పోటీలను నిర్వహించారు. 17 పొట్టేళ్లు పోటీల్లో పాల్గొనగా.. మొదటి బహుమతి కర్నూల్ జిల్లా దామగట్లకు చెందిన భార్గవ్ పొట్టేలుకు, రెండో బహుమతి కర్నూల్ జిల్లా ఆదోని మండలం పెకడుమూరు చెందిన సిద్దార్థ పొట్టేలుకు, మూడో బహుమతి హైదరాబాద్ సిటీ సనత్‌నగర్‌కు చెందిన ఖాలీ పొట్టేలుకు, నాల్గో బహుమతి కర్నూల్ జిల్లా ఎంబాయికి చెందిన ఆంద్రమౌళి పొట్టేలు గెలుచుకున్నాయి. పొట్టేళ్ల యజమానులకు ఆలయ కమిటీ నగదు బహుమతులను పంపిణీ చేసింది.