Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండురోజుల్లో 8 కేసుల్లో 9.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దానివిలు రూ.4.75 కోట్లు ఉంటుందని చెప్పారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు అజర్బైజన్ జాతీయులను తనిఖీ చేయగా వారి బ్యాగుల్లో 6 కిలోల బంగారం లభించిందని తెలిపారు. దాని విలువ రూ.2.99 కోట్లు ఉంటుందన్నారు.