Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లఖీంపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయరహదారిపై ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ ఇరుక్కుపోయింది. దీంతో రెండు వాహనాలను వేరుచేయడానికి పాదచారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు వారిని ఢీకొట్టింది. దీంతో ఐదుగురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు. కాగా, ప్రమాద ఘటనపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.