Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో చెక్పోస్ట్ దగ్గర ఓ కారు డివైడర్ను ఢీ కొంది. కారులో యువతులతో కలిసి షికార్లు చేస్తూ ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న యువతులు రోడ్డుపైనే కారు వదిలి పరారయ్యారు. కారు అదుపు తప్పి దూసుకు వస్తుండటంతో జనం భయంతో పరుగులు తీశారు. కారు ఫిల్మ్ నగర్ వైపు నుంచి చెక్ పోస్ట్ వైపునకు వస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 65కు వెళ్లే రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సాయంతో కారును తొలగిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.