Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నుమయీస్లో నగర షీ టీమ్స్ నిఘాతో... 41 మంది ఆకతాయిలను అరెస్టు చేశారు. రద్దీగా ఉండే చోట మహిళలు, యువతులను వేధిస్తున్న 41 మంది ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. నిందితులకు 3 రోజుల నుంచి 10 రోజుల వరకూ జైలు శిక్ష విధించింది. నాంపల్లిలో జరుగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన జనవరి 1 నుంచి ప్రారంభమైన రోజు నుంచి ప్రతి రోజు సుమారు 50 వేల మంది సందర్శిస్తున్నారు. రద్దీ ఉండే చోట మహిళలు, యువతులను అసభ్యమాటలు, వికృత చేష్టలతో వేధిస్తున్న 41 మంది ఆకతాయిలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వేలాది మంది చేరిన చోట తమను ఎవరు గుర్తించలేరనే ఉద్దేశ్యంతో ఆకతాయిలు మహిళలను తాకేందుకు ప్రయత్నించటం, బిగ్గరగా అరవడం చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.