Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగుళురు
గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో గుండెపోటుతో చికిత్స పొందుతున్న తారకరత్నను.. తన సోదరుడు కళ్యాణ్‌రామ్‌తో కలిసి వెళ్లి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్యంపై కీలక అప్డేట్ చ్చారు.
తారకరత్న ప్రాణాలతో పోరాడుతున్నారని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తాను ఐసీయూలోకి వెళ్లి పలకరించే ప్రయత్నం చేశానని.. కొంత రెస్పాన్స్ కనిపించిదని చెప్పారు. తారకరత్న ఎక్మోపై లేరని స్పష్టం చేశారు. ఆరోగ్యం విషమంగానే ఉన్నప్పటికీ వైద్యానికి స్పందిస్తున్నారని పేర్కొన్నారు. ఎందరో అభిమానుల ఆశీర్వాదం తారకరత్నకు ఉందని.. తొందరలోనే కోలుకుంటారని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు బాలకృష్ణ కూడా తారకరత్న ఆరోగ్యంపై స్పందించారు. నిన్నటికంటే తారకరత్న ఆరోగ్యం మెరుగ్గా ఉందని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని.. వైద్య సేవలకు స్పందిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతానికి స్టంట్ వేయడం కుదరదని చెప్పారు.