Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీశైలం
శ్రీశైలం జలాశయం వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు జలాశయం వద్దకు రాగానే మలుపు వద్ద అదుపుతప్పింది. డ్రైవర్ బస్సు వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ఘాట్‌రోడ్ లోని రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రక్షణ గోడ ధ్వంసమైనప్పటికీ, ఇనుప బారికేడ్ ఉండటంతో బస్సు లోయలో పడకుండా ఆగిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు వెంటనే కిందకు దిగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇరువైపులా ఉన్న ఘాట్‌రోడ్ మలుపుల వద్ద రక్షణ గోడలు బలహీనంగా ఉన్నాయి. ఇనుప బారికేడ్ ఉండటంతో ఇవాళ జరిగిన ప్రమాదం నుంచి 30 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.