Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. పోచెఫ్ స్ట్రూమ్ లో జరుగుతున్న టైటిల్ పోరులో భారత అమ్మాయిలు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పిచ్ ను సద్వినియోగం చేసుకుని ఇంగ్లండ్ ను 68 పరుగులకే కుప్పకూల్చారు.
భారత బౌలర్లలో తితాస్ సాధు 2, అర్చనా దేవి 2, పర్శవి చోప్రా 2, మన్నత్ కశ్యప్ 1, కెప్టెన్ షెఫాలీ వర్మ 1, సోనమ్ యాదవ్ 1 వికెట్ తీసి ఇంగ్లండ్ పతనంలో పాలుపంచుకున్నారు. ఇంగ్లండ్ జట్టులో రయానా మెక్ డొనాల్డ్ అత్యధికంగా 19 పరుగులు చేసింది. నిమా హోలాండ్ 10, అలెక్సా స్టోన్ హౌస్ 11, సోఫియా స్మేల్ 11 పరుగలు చేశారు.