Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదిక. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు న్యూజిలాండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఇక టీమిండియా నుంచి ఉమ్రాన్ మాలిక్ ను తప్పించారు. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ను తుదిజట్టులోకి తీసుకున్నారు. టీమిండియాకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా, కివీస్ జట్టుకు స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది.