Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గుజరాత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ క్లర్క్ పరీక్ష ప్రశ్నాపత్రం హైదరాబాదులో లీకైంది. నేటి ఉదయం పరీక్ష జరగాల్సి ఉండగా, రెండు గంటల ముందే క్వశ్చన్ పేపర్ బయటికి వచ్చింది. దాంతో గుజరాత్ ప్రభుత్వం పరీక్షను నిలిపివేసింది. పంచాయతీరాజ్ విభాగం జూనియర్ క్లర్క్ నియామకాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే, ప్రశ్నాపత్రాల ముద్రణ బాధ్యతను తెలంగాణ, ఏపీలోని ప్రింటింగ్ ప్రెస్ లకు అప్పగించారు. పేపర్ లీకైన నేపథ్యంలో, హైదరాబాదు శివారు ఐడీఎం బొల్లారంలోని కేఎల్ ప్రింటింగ్ ప్రెస్ లో గుజరాత్ ఏటీఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కేఎల్ ప్రింటింగ్ ప్రెస్ లోనే గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష ప్రశ్నాపత్రాలు ముద్రించారు. ఒడిశాకు చెందిన జితూ నాయక్ తో కలిసి సర్దాకర్ రోహా పేపర్ లీక్ చేసినట్టు గుర్తించారు. సర్దాకర్ రోహా ప్రింటింగ్ ప్రెస్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. లీక్ నేపథ్యంలో, గుజరాత్ పోలీసులు సర్దాకర్ రోహాను అదుపులోకి తీసుకున్నారు.