Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలో జరిగే ప్రపంచ పర్యావరణ. జల వనరుల సమావేశాల్లో కీలక ఉపన్యాసం చేయాలని పిలుపు వచ్చింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నేతృత్వంలోని పర్యావరణ – నీటి వనరుల సంస్థ ఈ మేరకు కేటీఆర్‌ను విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది.
ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సంస్థ ఎండీ బ్రియాన్ పార్సన్స్, సంస్థ అధ్యక్షుడు షిర్లీ కార్ల్ నేతృత్వంలోని బృందం సందర్శించింది. కాళేశ్వరం నిర్మాణం, తీరు, ప్రాజెక్టు పరిధి – నీటి సామర్థ్యం తెలుసుకుని ఆశ్చర్యపోయింది. దీంతో మంత్రి కేటీఆర్‌ను కలిసి తక్కువ కాలంలోనే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసిన తీరుపై అభినందనలు తెలిపింది. ఈ క్రమంలోనే అమెరికాలో జరిగే ప్రపంచ పర్యావరణ & జల వనరుల సమావేశాల్లో దీని గురించి ప్రసంగించాలని కేటీఆర్‌కు లేఖ రాసింది. తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అవలంబించిన విధానాలు, రాష్ట్రం సస్యశ్యామలంగా మారిన క్రమాన్ని వివరించాలని ఆ లేఖలో పేర్కొంది.