Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్‌లో కేసీఆర్ సభకు హాజరైనంత మాత్రాన.. కాంగ్రెస్‌తో తమ భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ స్పష్టంచేశారు. భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి విపక్షాలను ఏకం చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను విరమించలేదని తెలిపారు. తెలంగాణ సచివాలయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తనను ఆహ్వానించారని.. అయితే తనకిక్కడ చాలా పనులు ఉండటంతో రాలేకపోతున్నట్లు తెలిపారు.
దీంతో పార్టీ నుంచి ఎవరినైనా పంపించాలని, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు సైతం ఈ విషయం చెప్పాలని కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలో తన బదులు తేజస్వీ యాదవ్, జనతాదళ్(యునైటెడ్) అధ్యక్షుడు లలన్ సింగ్‌లు ఆ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పాను. ఫిబ్రవరి 17న సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభ జరుగనుంది. ఖమ్మంలో నిర్వహించిన భారాస సభకు తనను ఎవరూ పిలవలేదని, పిలిచినా వచ్చి ఉండేవాడిని కాదని గతంలో నీతీశ్ చెప్పిన విషయం తెలిసిందే.