Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్ణాటక
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కైలేష్ ఖేర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మ్యూజిక్ కన్సర్ట్‌లో పాట పాడుతున్న ఆయనపై ఇద్దరు యువకులు బాటిల్‌తో దాడి చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాలు.. ప్రస్తుతం బెంగళూరులో హంపీ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ ఉత్సవాలు చివరి రోజు కావడంతో కైలేష్ ఖేర్‌తో ప్రత్యేక మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు అధికారులు. ఈ సందర్భంగా స్టేజ్‌పై ఆయన పాటలు పాడుతుండగా ఇద్దరు యువకులు ఆగ్రహంతో ఆయనపై వాటర్ బాటిల్ విసిరారు.
అయితే ఆ బాటిల్ కైలాష్కు సమీపంలో పడటంతో ప్రమాదం తప్పింది. బాటిల్ తనవైపు పడినప్పుడు కైలాష్ ఖేర్ అదేది పట్టించుకోకుండ తన ప్రదర్శను కొనసాగించారు. అనంతరం స్టేజ్‌పై ఉన్న సెక్యూరిటీ ఆ బాటిల్ తీసేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన యువుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. ఆయన మొత్తం హిందీ పాటలే పాడుతున్నారని, కన్నడ పాట పాడటం లేదనే ఆగ్రహంతోనే బాటిల్ విసిరినట్లు సదరు యువకులు వెల్లడించినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.