Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఆ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై వచ్చే సోమవారం విచారణ చేపట్టనున్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను పరిశీలించింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లలో మోడీ హస్తం ఉన్నట్లు బీబీసీ తన డాక్యుమెంటరీలో చూపించింది. దీంతో ఆ డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది.