Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నపవతెలంగాన - జైపూర్
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న దర్గా వద్ద రెండు గ్రూపుల మద్య ఘర్షణ జరిగింది. బరేల్వీ, ఖాదిమ్ వర్గాల మధ్య ఆ పోరు జరిగినట్లు తెలుస్తోంది. దర్గా వద్ద రెండు వర్గాలు కొట్టుకున్న వీడియో కూడా లీకైంది. సూఫీ సంత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఉర్సు వేడుకలకు హాజరైన బరేల్వీ వర్గ ప్రజలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. బరేల్వీ వర్గానికి అనుకూలంగా వాళ్లు స్లోగన్స్ ఇచ్చారు. ఈ తరుణంలో దర్గాను చూసుకుంటున్న ఖాదిమ్ వర్గ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. నినాదాలు చేయవద్దు అంటూ బరేల్వీ వర్గాన్ని కోరారు. ఆ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు దళాలకు చెందిన అనేక మంది ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.