Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లామాబాద్
పాకిస్థాన్ లో పెషావర్ లోని ఓ మసీదులో సోమవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 28మంది మృతి చెందగా సుమారు 150మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. పెషావర్‌లోని పోలీస్ లైన్స్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు తెలిపారు.
ఈ తరుణంలో అనేకమంది ఆస్పత్రిలో చేరినట్లు పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆస్పత్రి అధికార ప్రతినిధి మహమ్మద్ అసీం తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పేలుడు జరిగిన ప్రదేశాన్ని పూర్తిగా సీజ్ చేసిన పోలీసులు కేవలం అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఈ పేలుడు ధాటికి భవనంలో కొంత భాగం కుప్పకూలిపోగా ఆ శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్టు పోలీసు అధికారి సికిందర్ ఖాన్ తెలిపారు.