Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ హీరో నాని నటిస్తోన్న మాస్ ఎంటర్టైనర్ దసరా. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం మేకర్స్ టీజర్‌ను లాంఛ్ చేశారు. ఈర్లపల్లి చుట్టూర బొగ్గు కుప్పలు.. మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం అంటూ సాగే పక్కా పల్లెటూరి మాస్ డైలాగ్స్ తో షురూ అయింది టీజర్.
నీయవ్వ.. ఎట్టైతె గట్లాయే గుండు గుత్తగా లేపేద్దాం.. బాంచెన్ అంటూ పక్కా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ అదరగొట్టేస్తున్నాడు నాని. బొగ్గుగని బ్యాక్ డ్రాప్లో సాగే ఎలిమెంట్స్ తో పక్కా మాస్ వినోదాన్ని అందించేలా దసరా ఉండబోతుందని టీజర్‌తో చెప్పేశాడు దర్శకుడు. దసరాలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ దసరా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.
తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.