Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ బీజేపీపై ఉన్న అసంతృప్తిని మరోసారి బయటపెట్టారు. బీజేపీతో మళ్లీ కలిసి పనిచేసే అంశాన్ని తోసిపుచ్చిన ఆయన.. వారితో జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో తమ నుంచి కాషాయ పార్టీనే లాభపడిందన్న నీతీశ్.. వారికి దూరంగా ఉండే ఓ వర్గం ఓట్లతోనూ బీజేపీ ప్రయోజనం పొందిందని చెప్పారు. బిహార్‌లో వచ్చే ఎన్నికల్లో 40లోక్‌సభ స్థానాలకు గాను 36 చోట్ల గెలుస్తామని బీజేపీ చెప్పడంపైనా నీతీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తోపాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌లపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని.. 2017లో ఎన్డీఏలోకి వచ్చి తప్పిదం చేశానని నీతీశ్ కుమార్ ఉద్ఘాటించారు.