Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాబిన్ హుడ్‌గా పేరుగాంచిన సర్వాయి పాపన్నపై తెరకెక్కించిన డాక్యుమెంటరీ అంతర్జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకుంది. సుపద క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సర్వాయి పాపన్న.. ది సోషియో పొలిటికల్ వారియర్ ఆఫ్ దక్కన్ చేతన్ కత్తి దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరిలో అవార్డు దక్కించుకుంది. 34 నిమిషాల నిడివితో రూపొందించిన ఈ డాక్యుమెంటరీని పొన్నం రవిచంద్ర నిర్మించారు. ఈ ఫెస్టివల్లో 65 డాక్యుమెంటరీలు పోటీకి రాగా.. వీటిలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 17 డాక్యుమెంటరీలు స్క్రీనింగ్‌కు ఎంపికయ్యాయి. వీటిలో 5 డాక్యుమెంటరీలు భారత్‌కు చెందినవని కాగా.. మిగిలిన డాక్యుమెంటరీలు అమెరికా, చిలీ, జర్మనీ, బెల్జియం, చైనా, స్పెయిన్ దేశాలకు చెందినవి. ఈ దేశాలన్నింటి నుంచి వచ్చిన డాక్యుమెంటరీల్లో తెలంగాణ నుంచి సర్వాయి పాపన్న ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు అందుకోవడం తెలంగాణకు చాలా ప్రత్యేకమైన సందర్భం.