Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నాని తన కెరియర్ పరంగా 30వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. వైర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. రేపు ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ పూజా కార్యక్రమానికి చిరంజీవి గెస్టుగా హాజరుకానున్నారు. అందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ, ఆ పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. డైరెక్టర్ తో పాటు సంగీత దర్శకుడు కూడా టాలీవుడ్ కి కొత్త కావడం విశేషం.
'సీతా రామం' సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మృణాళ్ ఠాకూర్, ఈ సినిమాలో నాని సరసన కనిపించనుంది. ఈ సినిమా కథా నేపథ్యంతో పాటు, ఇతర విషయాలు త్వరలో తెలియనున్నాయి. ఈ సినిమాలో నాని ఎలాంటి లుక్ తో కనిపిస్తాడనేది చూడాలి మరి.